న్యూఢిల్లీ:
పాకిస్తాన్ దళాల నిర్బంధంలో ఉన్న పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా
ప్రార్థిస్తుంటే.. ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలతో ‘‘రికార్డ్ బ్రేకింగ్’’ వీడియో
కాన్ఫరెన్సులో పాల్గొనటం సిగ్గు చేటని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు
విమర్శించాయి. ‘‘తప్పుడు ప్రాధాన్యతలకు స్పష్టమైన నిదర్శనమిది. భారత సాహస వింగ్
కమాండర్ అభినందన్ వెంటనే, క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ 132 కోట్ల మంది
భారతీయులు ప్రార్ధనలు చేస్తుంటే మోదీ ధ్యాసంతా కేవలం మళ్లీ అధికారంలోకి
రావడంపైనే ఉంది. కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించదలచిన ముఖ్యమైన సీడబ్ల్యూసీ
సమావేశాన్ని, ర్యాలీని రద్దు చేసుకుంది. ప్రధాన సేవకుడు మాత్రం ఓ వీడియో
కాన్ఫరెన్స్‌ను సృష్టించే పనిలో మునిగిపోయారు. ఇదీ రికార్డే’’ అని కాంగ్రెస్
అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్ చేసారు. ‘ప్రధానమంత్రి మేరా
బూత్ సబ్ సే మజ్బూత్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను. ఒక దేశంగా
ఇప్పుడు మన పైలట్‌ను క్షేమంగా వెనక్కి తీసుకు రావడానికి, పాకిస్తాన్‌తో కఠినంగా
వ్యవహరించడానికి శక్తినంతా ఉపయోగించాల్సిన అవసరం ఉంద’ని ఢిల్లీ ముఖ్యమంత్రి,
ఆమాద్మీ చీఫ్ కేజ్రీవాల్ ట్వీట్ చేసారు. దేశ వ్యాప్తంగా 15 వేల ప్రదేశాల్లోని
కోటి మంది బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.