ఆ సీటుపై టీడీపీలో సాగుతున్న పంచాయితీ!

ఆ సీటుపై టీడీపీలో సాగుతున్న పంచాయితీ!

జమ్మలమడుగు అభ్యర్థిత్వం విషయంలో తెలుగుదేశం పార్టీలో పంచాయితీ కొనసాగుతూ… ఉంది. దాదాపు నెలరోజుల నుంచి ఈ సీటు విషయంలో సమావేశాల మీద సమావేశాలు, పంచాయితీల మీద పంచాయితీలు కొనసాగుతూ.. ఉన్నాయి. అయితే అభ్యర్థి ఎవరనేది మాత్రం తేలడంలేదు.కొన్నిరోజుల కిందట ఎమ్మెల్యే టికెట్ రామసుబ్బారెడ్డికే అని చంద్రబాబు నాయుడు తేల్చేసినట్టుగా లీకు ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డికి కూడా ఈ స్పష్టత ఇచ్చారని, ఆదికి కడప ఎంపీ  టికెట్ ను ఖరారు చేసినట్టుగా తెలిపారు. చంద్రబాబే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఈ కథ మళ్లీ మొదటకు వచ్చింది.మళ్లీ సమావేశాలు, ఆది, రామసుబ్బారెడ్డిలు వేర్వేరుగా వెళ్లి చంద్రబాబును కలవడం, ఎవరికి వారు తమకే ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబట్టడం జరిగింది. ఇక చంద్రబాబు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చలేకపోతున్నట్టుగా ఉన్నాడు. ముందుగా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ అని తేల్చేసి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నాడన్నారు కానీ.. బాబు మళ్లీ తన నిర్ణయం విషయంలో రెండో ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నాడు.ఆది కా, రామసుబ్బారెడ్డి కా.. అనే విషయాన్ని బాబు ఎంతకూ తేల్చలేకపోతున్నట్టుగా ఉన్నాడు. అధినేత నిర్ణయం ప్రకారం.. అంటున్నారు కానీ, మళ్లీ ఎవరికి వారు టికెట్ విషయంలో పట్టుపడుతూ ఉన్నారు. మరోవైపు ఈ సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డా.సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. తెలుగుదేశం కథ మాత్రం తేలడంలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos