ఆ సత్తా కాంగ్రెస్‌కే ఉంది…రఘువీరా

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే సత్తా టీడీపీ, వైసీపీకి ఉందా అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం విజయవాడలో కాంగ్రెస్ రోడ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నారాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు, యువతకు ఉద్యోగాలు రావాలన్నా రాహుల్ దేశ ప్రధాని కావాలని, కనుక ప్రజలంతా కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపించాలని రఘువీరారెడ్డి పిలుపు ఇచ్చారు. వచ్చే ఎన్నికల అనంతరం రాహుల్ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం ప్రాణత్యాగం చేసిందని కొనియాడారు. సోనియాకు మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ మార్చి 1న ఏపీకి వస్తున్నారని, ఆయన పర్యటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలుపుతారని రఘువీరా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఖుష్బూ పాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos