హైదరారాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ బస చేసిన దస్పల్లా హోటల్‌కు జనవరి 30వ తేదీ సాయంత్రం ఓ అగంతకుడు వచ్చినట్లుగా పోలీసులు కనుగొన్నారు. జయరాం ఆదేశాల మేరకు ఆ వ్యక్తి రూ.6 లక్షలు తీసుకొచ్చి అందజేసినట్లు సమాచారం. జయరామ్ ఆ డబ్బులు ఎందుకు తెప్పించారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా సమీక్షిస్తున్నారు. కాగా జయరామ్ అమెరికన్ సిటిజన్ కావడంతో.. దర్యాప్తు తీరుపై అమెరికన్ ఎంబసీ ఆరా తీస్తోంది. జయరామ్ హత్య అటు ఏపీ, ఇటు తెలంగాణలో కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం గ్రామం శివారులో 65వ నెంబరు జాతీయరహదారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున జయరామ్ మృత దేహం లభ్యమైంది. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తుండగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఆయన కారు డ్రైవర్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడకు చెందిన జయరామ్.. భార్య పద్మజా ఇద్దురు పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. ఆయనకు బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. కృష్టాజిల్లా కేంద్రంగా ఏర్పాటైన కోస్టల్ బ్యాంక్‌కు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు