హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచనలం నమోదైంది. ఓ పాపకు జన్మనిచ్చినా.. తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తూ అమెరికా టెన్నిస్ స్టార్ రికార్డు గ్రాండ్‌స్లామ్ వేటలో దిగ్విజయంగా దూసుకుపోతోంది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ 6-1, 4-6, 6-4 స్కోర్ తేడాతో వరల్డ్ నంబర్ వన్ సిమోనా హలెప్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్‌లోకి వెళ్లింది. 37 ఏళ్ల సెరీనా మొదటి సెట్‌ను కేవలం 20 నిమిషాల్లోనే కైవసం చేసుకోవడం విశేషం.