అజ్మీరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సన్నిహిత పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాలను రద్దు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం అజ్మీరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనను, తన కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని మోదీ అవమానిస్తున్నాతాను పార్లమెంటులో మోదీని ఆలింగనం చేసుకున్నానని చెప్పారు. ద్వేషాన్ని ప్రేమతోనే ఓడించగలమన్నారు., ఆయనలో కరుడు కట్టిన ద్వేషాన్ని ప్రేమతో బదులు ఇచ్చానని చెప్పారు. మోదీ పాలనలో అన్యాయాన్ని ఎదుర్కొన్న అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలను రద్దు చేసిందన్నారు. రైతుల రుణాల రద్దుపై మోదీ కేవలం ఉత్తుత్తి వాగ్దానాలు మాత్రమే చేశారన్నారు.