సేంద్రియ సాగులో పేరుగాంచిన డాక్టర్ నారాయణ రెడ్డి సోమవారం తుది శ్వాస వదిలారు.అయన వయస్సు (80).ముగ్గురు కొడుకులు,భార్య ఉన్నారు. సాయంత్రం వరుటూరు సమీపంలోని అయన అంత్య క్రియలు జరిగాయి.బెంగళూరు జిల్లా దొడ్డబళ్లాపుర తాలూకా మారలేనా హళ్ళికి నివాసి అయిన ఆయనా సేంద్రియ సాగుతో సేద్య రంగనాన్ని మలుపు తిప్పారు.జపాను మాసానవో ఫుకువోకా సేద్య పద్దతిని విజయవంతంగా అనువర్తనం చేశారు.దీని విశిష్టతను ప్రచారం చేసి ఇతర రైతులూ ఈ విధానాన్ని చేపట్టేందుకు ప్రోత్సహహించారు. స్థానిక వనరులతోనే సేంద్రియ సాగు వేయవచ్చని నిరూపించారు.ఈ సాగుకు కన్నడ నాట ప్రథములుగా వినుతి కెక్కారు. తక్కువ నీటితో వారి సాగు చేసి అధిక దిగుబడికి సాధించారు..రైతులకు సాగు లో సలహాలు ఇచ్చి పంట దిగుబడి పెంపునకు కృషి చేశారు.పర్యావరణం పట్ల అమిత శ్రద్దాసక్తుల్ని కలిగిన ఆయన మొక్కల పెంపకాన్ని చేపట్టి ఈ దిశలో రైతాంగాన్ని ప్రోత్సహించారు. పలు దేశాల్లో పర్యటించి సేంద్రియ సాగు గురించి ఉపన్యసించారు. ఆయన సేవాల్ని గుర్తించిన హంపి విశ్వవిద్యాలయం ఆయన్ను నాడోజ బిరుదుతో సత్కరించింది.