ఆధారాల్లేకుండా పాక్‌ ను నిందిచవద్దు

తగిన సాక్షాధారాల్లేకుండా పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపించడం సరికాదని ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ వ్యాఖ్యానించారు. ఈ దాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు ఆధారాలు ఉంటేనే పాక్‌ను నిందించాల న్నారు. ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు పాకిస్థాన్ ఇప్పటికే ప్రకటించిందన్నారు. ఒకవేళ ఆ దేశం దాడిని ఖండించని పక్షంలో వారిని నిందించవచ్చని చెప్పారు. జవాన్లపై దాడికి పాల్పడింది భారత కశ్మీరి అని తెలిసి కూడా పాక్ ను నిందిస్తున్నారని తప్పుబట్టారు. స్వామి అగ్నివేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos