ఆంధ్రాకు ప్రియాంక రాక

ఆంధ్రాకు ప్రియాంక రాక

ఢిల్లీ : ఈ నెల మూడో వారంలో ఏపీకి ప్రత్యేక హోదా భరోసా యాత్రను
ప్రారంభించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు
రాహుల్‌ గాంధీతో పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని
చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆంధ్రాకు తీరని
అన్యాయం చేశారని విమర్శించారు. ఆదివారం ఆంధ్రాకు రానున్న ఆయనకు నల్ల జెండాలతో నిరసనలు
తెలుపుతామన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ నెలాఖరులోగా
ఖరారు చేస్తామన్నారు. మేనిఫెస్టో కూడా అప్పటికి తయారవుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos