అసలే కొన ఊపిరి.. ఆపై వెంటాడిన విధి!

అసలే కొన ఊపిరి.. ఆపై వెంటాడిన విధి!

కొనఊపిరితో ఉన్న ఓ రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌ ప్రమాదానికి గురవ్వడంతో…అందులోని రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన జావెద్‌ సర్కార్‌ కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బెంగళూరులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఏక్షణంలోనైనా చనిపోవచ్చని వైద్యులు బంధువులకు చెప్పారు. దీంతో మంగళవారం రాత్రి బంధువులు జావెద్‌ను తీసుకుని అంబులెన్సులో పశ్చిమబెంగాల్‌కు బయలుదేరారు. వేగంగా వెళుతున్న అంబులెన్సు భీమడోలు మండలం కురెళ్లగూడెం, పూళ్ల గ్రామాల మధ్య ఫోను స్తంభాన్ని ఢీకొని, పక్కన ప్రహరీని ఢీకొట్టి ఆగింది. వాహనంలోని జావేద్‌ మృతిచెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos