అమెరికాలో 200 మంది తెలుగు విద్యార్థుల అరెస్ట్

అమెరికాలో 200 మంది తెలుగు విద్యార్థుల అరెస్ట్

అమెరికాలో 200 మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. మిచిగాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింటన్‌లో ఫేక్ సర్టిఫికెట్ల స్కామ్‌ బయటపడింది. US సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ టీమ్‌.. పక్కా నిఘా పెట్టి ఈ నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌ గుర్తించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో భారతీయులు అందునా దాదాపు 200 మంది తెలుగువిద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఈ ఫేక్ వర్సిటీని ఏర్పాటు చేశారు. అక్రమ వలసదారులను గుర్తించడమే టార్గెట్‌గా దీన్ని 2015లో ఏర్పాటు చేశారు. ఈ అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా HSI ఆఫీసర్లు.. వర్సిటీలో ఉద్యోగులుగా చేరారు. అక్కడి నుంచి వరసగా నిఘా పెట్టి ఫేక్ మాస్టర్స్ డిగ్రీలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించారు. ఇప్పుడు వీళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు.CIS దర్యాప్తు చాలా పకడ్బందీగా సాగింది. వర్సిటీలో ఎలాంటి డిపార్ట్‌మెట్లు లేకపోయినా.. ప్రొఫెసర్లు లేకపోయినా కూడా క్లాస్‌లు నిర్వహిస్తున్నట్టు చూపిస్తూ అడ్మిషన్లు ఇచ్చారు. ఇల్లీగల్‌గా అమెరికాలో ఉండేందుకు ఇలాంటి వర్సిటీలు ఎంచుకుంటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారో తేల్చేందుకు ఈ నకిలీలన్నీ చూసీచూనట్టు వదిలేశారు. కేసులో కీలక సూత్రధారులు ఎవరో తేలాక.. అప్పుడు వరసపెట్టి అరస్టులు మొదలుపెట్టారు. USCIS స్టింగ్ ఆపరేషన్‌లో ఈ ఫేక్ అడ్మిషన్ల స్కామ్ బయటపడడంతో ఇప్పుడు తల్లిదండ్రులంతా షాక్‌కి గురయ్యారు. అమెరికాలో తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు.హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చాలా పకడ్బందీగా ఒక్కో విద్యార్థిని ట్రాక్ చేసింది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వారిలో ఎవరు రెగ్యులర్‌గా వస్తున్నారు.. ఎవరి కథంటో పక్కాగా నిఘా పెట్టింది. మొత్తం గుట్టు రట్టయ్యాక దీనిపై మిచిగాన్ సదరన్ డివిజన్‌లో కేసు కూడా నమోదయ్యింది. వీసా మోసాలకు సంబంధించి ఈ కేసులో.. కుట్రదారులుగా భరత్ కాకిరెడ్డి, సురేష్‌రెడ్డి కండల, ఫణిదీప్ కర్నాటి, ప్రేమ్‌కుమార్ రామ్‌పీస, సంతోష్‌రెడ్డి సామా, అవినాష్ తక్కళ్లపల్లిలను ముద్దాయిలుగా చేరుస్తూ కేసు పెట్టారు. ‘పే టు స్టే’ స్కీమ్ కింద వీళ్లంతా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఈ ఫేక్ వర్సిటీలో అడ్మిషన్ల స్కామ్‌కు తెరతీసినట్టు ఆ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. స్టూడెంట్ వీసా పొందేందుకు పాటించాల్సిన F-1 వీసా నిబంధనల విషయంలోనూ పలు అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టం చేసింది. ఈ కేసులో డిఫెండెంట్‌లుగా అంటే ముద్దాయిలుగా D1 నుంచి D6 వరకూ ఈ ఆరుగురు తెలుగువాళ్ల పేర్లనే పేర్కొన్నారు. ఈకేసులో కీలక నిందితుల్ని డెట్రాయిట్‌లో అరెస్టు చేశారు. మొత్తం 14 మందిని ఇప్పటి వరకూ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులే మారువేషాల్లో ఉద్యోగులుగా వర్సిటీలో చేరడం, అక్కడి నుంచి ట్రాప్ చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. జనవరి 15నే కొందరిని అదుపులోకి తీసుకున్నా.. సమగ్ర దర్యాప్తు దర్వాత మిగతా వాళ్ల అరెస్టులు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా ఈ కేసులో చిక్కుకున్న వారు ఎంబసీని కలవడం కానీ, న్యాయసలహా తీసుకుని ముందుకెళ్లడం మంచిదని అటార్నీ రాహుల్ సూచిస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన వాళ్లు ఏం చేయాలి, అక్కడ వర్సిటీలో స్టూడెంట్స్‌గా ఉన్న వాళ్లు కేసులను తప్పించుకోవాలంటే వారి ముందు ఉన్న మార్గం ఏంటి అన్న దానిపై కొన్ని సూచనలు చేశారు.2015లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ యూనివర్సిటీ ఆఫ్‌ ఫర్మింటన్‌ అక్రమాలకు కేరాఫ్‌గానే ఉంది. దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులు ఇలా ఇల్లీగల్‌గా అమెరికాలో ఉండేందుకు అడ్మిషన్లు ఇచ్చినట్టు USCIS టీమ్ గుర్తించింది. US కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ రంగంలోకి దిగడం.. కొందరిని అరెస్టు చేయడం పెను సంచలనంగా మారింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక వలసదారుల్ని అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇమిగ్రేషన్ చట్టాన్ని కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్సిటీలపైనా మరింత గట్టిగా నిఘా పెట్టారు. అక్కడ చేరుతున్న స్టూడెంట్స్ నిజంగానే చదువు కోసం వస్తున్నారా లేక ఉద్యోగాలు చేస్తున్నారా అన్న దానిపై ఆరా తీశారు. రోజూ వర్సిటీకి వచ్చేదెవరు ఏంటన్నది తేల్చేందుకు స్టింగ్ ఆపరేషన్ చేశారు. దీంతో.. ఒక్కసారిగా ఫేక్ అడ్మిషన్ల స్కామ్ బయటపడింది. ప్రభుత్వమే ఇలా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించడం.. వందల మందిని అరెస్టు చేయడం పెనుకలకలాన్నే రేపుతోంది.అరెస్టైన వారిలో దాదాపు అంతా తెలుగువాళ్లే కావడంతో.. తానా ప్రతినిధులు హుటాహుటిన రంగంలోకి దిగారు. యువకులకు సాయం చేయాలంటూ న్యూయార్క్‌లోని భారత్ కాన్సులేట్ జనరల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తానా ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి ఇండియన్ కాన్సులేట్ జనరల్ సందీప్ చక్రవర్తిని కలిసి వినతిపత్రం అందించారు. USCIS టీమ్‌తో మాట్లాడి వివాదం పరిష్కరించాలని కోరారు. భారతప్రభుత్వం తరపున తెలుగు విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.ఈ యూనివర్సిటీ ఫేక్ అని తెలియదా అంటే కొందరికి అన్నీ తెలిసే ఇందులో అడ్మిషన్లు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అమెరికాలో వీసా గడువు ముగిసాక ఎవరైనా సరే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. కానీ అక్కడే ఉండాలనుకున్న వాళ్లు.. ఇలా అక్రమ పద్ధతుల్లో కొన్ని వర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. అక్కడ చదువుతున్నట్టు పత్రాలు చూపించి వీసా పొడిగించుకున్నాక.. తమ తమ ఉద్యోగాలు కంటిన్యూ చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం ఎత్తుకున్న ట్రంప్.. తాను ప్రెసిడెంట్ అయ్యాక వసలదారులపై కొరడా ఝూళిపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింటన్‌పై నిఘా పెడితే మొత్తం స్కామ్ బయటపడింది. వందల మంది ఇప్పుడీ స్కామ్‌లో ఇరుక్కోవడంతో ఏం చేయాలో తల్లిదండ్రులు పాలుపోవడం లేదు. తమ వాళ్ల భవిష్యత్‌పై వారు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos