ఇ-కామర్స్ సంస్థలకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2019, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తమకు వాటాలు ఉన్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా ఇ-కామర్స్ సంస్థలు విక్రయించకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వేల కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెడుతూ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాయి. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్.. ఫ్లిప్ కార్ట్‌ను సొంతం చేసుకోవడంతో ఈ పోటీ మరింత వేడెక్కింది.తమకు వాటాలు ఉన్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా ఇ-కామర్స్ సంస్థలు విక్రయించకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అలాగే ఎక్స్‌క్లూజివ్ డీల్స్ పేరుతో అమ్మకాల్ని కూడా నిషేధించారు. అయితే ఇప్పటి వరకు ఈ పద్ధతుల్లో భారీ డిస్కౌంట్లు ఇస్తూ అమ్మకాలు పెంచుకుంటున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఇది ఎదురుదెబ్బేనని చెప్పాలి.బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దేశీయ ఇ-కామర్స్ వ్యాపారులు, చిన్న సంస్థల యజమానుల ఒత్తిడి వల్ల ఈ కొత్త నిబంధనలు వచ్చాయి.