కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనకు ఏర్పడిన ఓ అడ్డంకి తొలగింది. ఝార్‌గ్రామ్ ప్రాంతంలో హెలిప్యాడ్‌కు రాష్ట్ర పోలీసులు బుధవారం అనుమతి మంజూరు చేశారు. నైరుతి పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో అమిత్ షా బుధవారం పర్యటించవలసి ఉంది. మొదట ఇక్కడ హెలిప్యాడ్‌కు అనుమతి లేకపోవడంతో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. అమిత్ షా హాజరయ్యే అవకాశం లేకపోతే ఝార్‌గ్రామ్‌లో బీజేపీ సీనియర్ నేతలు కైలాశ్ విజయవర్ఘీయ, రూపా గంగూలీ పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు.