శ్రీనగర్: ‘వీర్ జవాన్.. అమర్ రహే’ నినాదాలతో కశ్మీర్‌లోని బుద్గామ్ సీర్పీఎఫ్ క్యాంప్ మారుమోగింది. పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా అంజలి ఘటించారు. సైనిక అధికారులు. హోంమంత్రి రాజ్‌నాథ్, జమ్ము- కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అమరులకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులుఅర్పించటమే కాకుండా జవాన్ల శవపేటికలను భుజాలపై మోసి సైన్యం పట్ల తన కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు.