అన్నీ అబద్ధాలే..రఫెల్ పై రాహుల్

దిల్లీ: రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోసారి పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ప్రారంభమైన అనంతరం రఫేల్‌ ఒప్పందంపై వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌కు సంబంధించిన కాంట్రాక్టులపై అనుమానాలు రేకెత్తేలా చేసి పార్లమెంటును తప్పుదోవ పట్టించేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని రక్షణశాఖ మంత్రి ఆరోపించారు.‌ దీనిపై రాహుల్‌ పార్లమెంటు బయట నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మలా సీతారామన్‌ ప్రధాని మోదీ ప్రతినిధిగా మారారంటూ మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos