డీసీపీ ని లంచం అడిగిన కానిస్టేబుల్

డీసీపీ ని లంచం అడిగిన కానిస్టేబుల్

జైపూర్ : ఇక్కడి రాజేంద్రప్రసాద్ అనే కానిస్టేబుల్ సాక్షాత్తు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)నే లంచం అడిగి సస్పెండ్ అయ్యాడు. జైపూర్ నార్త్ విభాగంలో డీసీపీ పరీష్ దేశ్ ముఖ్ బుధవారం రాత్రి నగరంలో నాకాబందీ నిర్వహించి సొంత వాహనంలో ఇంటికి తిరుగు ముఖం పట్టారు. ఆయనతో ఉన్న గన్ మన్, డ్రైవర్ కూడా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. వాహనాన్ని ట్రాన్స్ పోర్ట్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోటరీ సర్కిల్ రాజేంద్ర ప్రసాద్ ఆపేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటూ జరిమానా రసీదు చలాన్ రాసేందుకు సిద్ధమయ్యాడు. రూ.500 లంచం ఇస్తే జరిమాన విధించబోననీ చెప్పాడు. . ఈ విషయాన్ని డీసీపీ వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయటంతో రాజేంద్రప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో పోలీసుల తీరుతెన్నుల పరిశీలనకు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ అని పోలీసు అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos