అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత గోద్రా లాంటి ఘటనలు.

అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత గోద్రా లాంటి ఘటనలు.

ముంబై: అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత గోద్రా లాంటి అల్లర్లు జరిగే అవకాశం ఉందని శివసేన (ఉద్ధవ్ బాల్థాకరే) చీఫ్ ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. రామమందిర ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నారు. 27 ఫిబ్రవరి 2002న అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో కరసేవకలు బయలుదేరగా గుజరాత్లోని గోద్రా స్టేషన్లో ఆ రైలుపై దాడి జరిగింది. దుండగులు నిప్పు పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరగాయి. ఇప్పుడు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా పెద్దసంఖ్యలో ప్రభుత్వం ఆహ్వానాలు పంపిందని, బస్సులు, ట్రక్కుల్లో వచ్చే వారు తిరుగుప్రయాణ సమయంలో గోద్రా వంటి అల్లర్లకు ఆస్కారముందని ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల అనంతరం వచ్చే ఏడాది జనవరి 24న రామమందిరాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తప్ప చెప్పుకోవడానికి బీజేపీ, ఆరెస్సెస్కు మరెవరో లేకపోవడంతో తన తండ్రి బాల్థాకరేను వారసత్వంపై కన్నేసిందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos