సోనియా అభ్యంతరం : ప్రశ్న తొలగింపు

సోనియా అభ్యంతరం :  ప్రశ్న తొలగింపు

ఢిల్లీ: దేశంలో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యాన్ని సీబీఎస్ఈ టెన్త్ ఇంగ్లిష్ పేపర్‌లో ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత వారం సీబీఎస్ఈ నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారనే ప్రశ్న రావడాన్ని సోనియా ఖండించారు. దీనిపై సీబీఎస్ఈ వెంటనే స్త్రీలకు క్షమాపణలు చెప్పాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు.
సోమవారం ఈ అంశాన్ని సోనియా లేవనెత్తారు. కేంద్ర విద్యాశాఖ దీనిపై పూర్తి స్థాయి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లింగ నిర్దారణ ఆధారంగా పిల్లలకు ఈ తరహా ప్రశ్నలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. లోక్‌సభలో సోనియాగాంధీ ఈ అంశాన్ని లేవనెత్తిన సమయంలోనే సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది. టెన్త్ క్లాస్ సిలబస్‌తో పాటు ప్రశ్నాపత్రం నుంచి కూడా ఆ ప్రశ్నను తొలగిస్తునట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి ఫుల్ మార్కులు ఇస్తున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos