ఎమ్మెల్యే రోజా ఎక్కిన విమానంలో సమస్య..

అమరావతి: వైకాపా శాసనసభ్యులు రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో గత నాలుగున్నర గంటలుగా బెంగళూరు విమానాశ్రయంలో నిలిచి పోయింది. తలుపులు తీయక పోవటంతో లోపలే బిక్కుబిక్కమంటూఇతర ప్రయాణికులతో కలసి కాలం గడుపుతున్నారు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లిం చారు. విమానాన్ని ల్యాండ్ చేసినా తలుపులు మాత్రం తెరవలేదు. దీంతో గత నాలుగున్నర గంటలుగా రోజా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకు పోయా రు. ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ప్రముఖులు విమానంలో ఉన్నారు. సంబందిత వీడియోనూ ఆమె విడుదల చేశారు. ఫోన్ లో విలేకర్లతో మాట్లాడారు. ‘నాలుగు గంటలుగా విమానంలోనే ఉండిపోయాం. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినా.. అక్కడ పర్మిషన్ ఉందో లేదో చెప్పట్లేదన్నారు. డోర్లు కూడా తెరవడం లేదు. మబ్బు లు న్నాయని, కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని, కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తెలిసింది. విమానంలో తలెత్తిన సమ స్యను పరిష్కరించేందుకే బెంగళూరుకు వచ్చామని ఫ్లైట్ అధికారులు చెప్పారు. విమానంలో ప్రయాణికులు భయపడిపోతున్నారు. అరుస్తున్నారు. చంపేస్తారా? అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికులను కిందకు దించేందుకు ఎయిర్ పోర్టు అధికారుల నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదని పైలట్లు చెబుతు న్నారు. విమానంలో ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టుంది. నాకు ఇలా జరగడం ఇది రెండోసారి. హైదరాబాద్ లో విమానం టైర్ పేలిపోయి రాత్రి 10.40 గంటల సమయంలో ఇలాగే డోర్లు క్లోజ్ చేసి పెట్టారు. చేశారు. ఇటీవలే నాకు మేజర్ ఆపరేషన్ అయింది. ఒకే చోట నాలుగు గంటలు తాను కూర్చోలేనంటూ పైలట్ తో మాట్లాడాను. నాతో పాటు లావణ్య అనే తన కజిన్ విమానంలో ఉన్నారు. తన పొట్టకు 29 కుట్లు వేశారన్నారు. దాని వల్ల పొట్ట మీద భారం పడుతుంది. చాలా నొప్పిగా, బాధగా ఉంది. మెడికల్ గ్రౌండ్ లో దింపుతామని, అయితే, దానిని చెక్ చేసేందుకు సంబంధిత అధికారులు రావాల్సి ఉందని ఫ్లైట్ అటెండెంట్ చెప్పారరు. అయితే, విమానాన్ని ఎక్కడికి తీసుకె ళ్తారన్న దానిపై స్పష్టత లేదు. వెనక్కు తీసుకెళ్తారా? వేరే విమానం అరెంజ్ చేస్తారా? అన్నది చెప్పట్లేదు. ఇవాళ ఉదయం తిరుపతికి బయల్దేరాన’ని రోజా వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos