బాలీవుడ్ నటీనటులు రణబీర్ కపూర్-అలియాభట్‌ల ప్రేమాయణం గురించి బాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే.ఈ ప్రేమ జంట ఎక్కడి కనిపించినా ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది.ఈ క్రమంలో జీ సినిమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా రణబీర్-అలియా జంట సందడి చేసింది.అందులో రాజీ చిత్రంలో అలియాభట్ నటనకుగానూ అలియాకు ఉత్తమ నటి అవార్డు ప్రకటించారు.దీంతో అవార్డు అందుకోవడానికి వేదికపై వెళ్లడానికి సిద్ధమైన అలియాను దగ్గరకు తీసుకున్న రణబీర్ అలియా పెదవులపై ముద్దివ్వబోయాడు.వెంటనే తేరుకున్నఅలియా వెంటనే కొంచెం పక్కకు తప్పుకోవడం బుగ్గపై ముద్దిచ్చాడు.రణబీర్ ముద్దుకు సిగ్గుపడ్డ అలియా కూడా వెంటనే రణబీర్‌కు ముద్దు పెట్టేసింది.ప్రేమజంట ముద్దుముచ్చటను కార్యక్రమానికి హాజరైన అథిధులు,ఆహ్వానితులు సంతోషంతో చూస్తూ చప్పట్లు కొడుతూ ఈలలు వేశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.మరోవైపు జీ సినిమా అవార్డ్స్ లో ‘సంజు’ సినిమాకు గానూ ఉత్తమనటుడిగా అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో ఉత్తమనటుడిగా రణబీర్ పేరును అలియా స్వయంగా ప్రకటించడమే కాకుండా అవార్డు కూడా అందించింది..