దక్షిణాది కోసమే వయనాడ్‌ నుంచి పోటీ: రాహుల్‌

దక్షిణాది కోసమే వయనాడ్‌ నుంచి పోటీ: రాహుల్‌

న్యూ ఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే తాను వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ వెల్లడించారు. మంగళవారం ఇక్కడ లోక్సభ ఎన్నికల ప్రణాళిక చేసిన తర్వాత ప్రసంగించారు. ‘ప్రధాని మోదీ తమను శత్రువులా చూస్తు న్నారని దక్షిణాది ప్రజలు భావిస్తున్నారు. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. వారికి నేను అండగా ఉంటా. ఈ సందేశాన్ని వారికి తెలిపేందుకే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నా’ అని విశదీకరించారు.. గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని, విభజనకు పాల్పడిందని ఆరోపించారు. ఐక్య భారతాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ పని చేస్తోందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos