దేశం పేరు మార్పుపై కేంద్రానికి రాహుల్ గాంధీ చురకలు

దేశం పేరు మార్పుపై కేంద్రానికి రాహుల్ గాంధీ చురకలు

న్యూ ఢిల్లీ: ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తాజాగా ఫ్రాన్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘దేశం పేరుని మార్చడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘‘ఇండియా, భారత్.. ఈ రెండు పేర్లను రాజ్యాంగం వాడుతోంది. ఈ రెండు పేర్లు ఆమోదయోగ్యమైనవి. ఈ రెండు పేర్ల విషయంలో ఎలాంటి సమస్యా లేదు’’ అని బదులిచ్చారు. అనంతరం ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ.. ‘‘బహుశా మా ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం, కేంద్ర ప్రభుత్వానికి చిరాకు తెప్పించిందేమోనని నేను అనుకుంటున్నాను. వారిని ఆగ్రహావేశాలకు గురి చేసి ఉండొచ్చని భావిస్తున్నాను. అందుకే.. ఇండియాకి బదులుగా దేశం పేరుని భారత్గా మార్చాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos