ఏపీ సీఎంకు పీఆర్సీ నివేదిక

ఏపీ సీఎంకు పీఆర్సీ నివేదిక

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. 14.29 శాతం ఫిట్మెంట్‌ను సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ ప్రస్తావించింది.
ముఖ్యమంత్రికి పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తెలిపారు. అనేక అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos