జమ్ము : సరిహద్దులో తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ తగు రీతిలో బుద్ధి చెప్పింది. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో పాక్ ఆర్మీ జరుపుతున్న కాల్పులను తిప్పే కొట్టే క్రమంలో భారత దళాలు ఏడు పోస్టులను ధ్వంసం చేశాయి. పాక్ జవాన్లకు గాయాలు కూడా అయ్యాయని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాక్ కాల్పులు కారణంగా ఆ రెండు జిల్లాల్లోని సరిహద్దుల్లో ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు అయిదేళ్ల బాలిక కూడా ఉంది. భారత్ చేసిన దాడిలో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు మరణించారని పాక్ అధికారులు చెబుతున్నారు.