హైదరాబాద్ దాదాలు-ఇదీ వర్మ కొత్త సృష్టి

హైదరాబాదు: ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో సీమలో సంచలనాన్ని రేకెత్తించిన రామ్ గోపాల్ వర్మ హైదరాబాదు గూండాయిజాన్ని తెర కెక్కించనున్నారు.‘ విజయవాడ రౌడీలు, రాయల సీమ కక్షలు అయిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్ దాదాగిరి పై సినిమా తీయబోతున్నాన’ని తెలిపాడు. ఎనిమిదో దశకంలో భాగ్యనగరంలో రాజ్యమేలిన దాదాగిరి, దాదాల్ని ఈ సినిమా ప్రతిఫలిస్తుందన్నారు. అప్పటి ఒక గూండా చరిత్ర అధారంగా సినిమాను నిర్మిస్తున్నట్లు వివరించారు. దీనికీ ‘శివ’ సినిమానే స్ఫూర్తి అన్నారు. ‘హైదరాబాద్ దాదాలు’ చిత్రంలో ‘జార్జిరెడ్డి’ ఫేం సందీప్ మాధవ్ ప్రధాన పాత్రను పోషిస్తాడని చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos