ముస్లింలు భాజపా అభ్యర్థులు కాలేరు: ఈశ్వరప్ప

కొప్పళ: తమ పార్టీ ముస్లిం అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టబోదని మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప మంగళవారం ఇక్కడ తేల్చి చెప్పారు. ఇక్కడ జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ మిమ్మల్ని కేవలం ఓటుబ్యాంకులా వాడుకుంటుంది గానీ ఒక్క టికెట్ కూడా ఇవ్వదు. కర్నాటకలో ముస్లింలకు మేము టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మీకు మా మీద నమ్మకం ఉంటేనే టికెట్లుగానీ, మరేదైనా గానీ ఇస్తాం’ అని పేర్కొన్నారు. ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం సర్వసాధారణంగా మారింది. ‘కాంగ్రెస్ పార్టీలోని ముస్లింలు హంతకులు కాగా భాజపాలోని బీజేపీలోని ముస్లింలు ఉత్తములని నిరుడు ఫిబ్రవరిలో చేసిన వ్యాఖ్యల్ని చాలా మంది ఖండించారు. ‘ఎవరైనా నిన్ను లాక్కెళ్లి, అత్యాచారం చేస్తే ప్రభుత్వం ఏమి చేయగలదని ’మహిళా పాత్రికీయురాల్ని ప్రశ్నించి నగుబాట్ల పాలయ్యారు. ‘కర్నాటక మహిళలు నా సోదరీలు’అని ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ‘లెక్కలేనన్ని’ వివాదాస్పద వ్యాఖ్యలకు ఈ శ్వరప్ప మారు పేరుగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos