కొరటాల శివ ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా

కొరటాల శివ ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా

హైదరాబాదు: ఆచార్య సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు ఇక్కడి కొరటాల ఆఫీసు ముందు మంగళ వారం రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని నిర్మాతల దగ్గర నుంచి కొరటాల శివ తీసుకున్నారట. అందుకే బయ్యర్లు నష్టాన్ని కొరటాలనే భరించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos