న్యూ ఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో విపక్షాలు మంగళవారం భేటీ అయ్యాయి. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ కు నిరసనగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు విపక్షాల సభ్యులు పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం.