ఢిల్లీ : కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, దానికి అవసరమైన నిధులన ఎక్కడి నుంచి తెస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ఒడిశా సహా అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చామని, దానిని అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా అభినందించారని గుర్తు చేశారు. అనంతరం ఆయన యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధులు వస్తాయని వెల్లడించారు.