అమరావతి : కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని సిపిఎం కేంద్ర సమితి సభ్యుడు వి.శ్రీనివాసరావు విమర్శించారు. సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేదని మండి పడ్డారు. దీనికి విజయవాడలోని బీసెంట్రోడ్లో మంగళవారం నిరసన ప్రదర్శన జరపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘ఈ బడ్జెట్తో పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరం. పెట్రోలు రేట్లు పెంచడం దారుణం. కేవలం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలనే దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను తయారు చేసి నట్లుగా ఉంది. సామాన్యుల వస్తువుల ధరలు పెరగనున్నాయి. రైతులు అన్నిరోజులుగా పోరాడుతున్నా ఎందుకు స్పందించడం లేదు. వీటన్నింటీనీ ప్రజలు గమనించాలి. భవిష్యత్తులో మరిన్నిపోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాల’ని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సామాన్యులపై మరిన్ని భారాలు పడనున్నాయన్నారు. కరోనా కాలంలో సామాన్యులపై భారాలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బిజెపి,జనసేన నాయకులు కూడా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిం చారు.