రాయపూర్ : జీ20 సదస్సు నేపధ్యంలో రాష్ట్రపతి ఇవ్వనున్న విందుకు తాను హాజరు కావడం లేదని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ స్పష్టం చేశారు. జీ20 సదస్సును పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లలో భాగంగా వారాంతంలో ఢిల్లీ నుంచి షెడ్యూల్ కాని విమానాల రాకపోకలను నియంత్రించిన కారణంగా తాను ఈ విందుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఢిల్లీని నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే తాను అక్కడికి ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారత్ మండపంలో ఇవ్వనున్న ప్రత్యేక విందుకు జీ20 ప్రతినిధులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించారు.