బాలీవుడ్ సీనియర్ నిర్మాత,దివగంత అందాలతార శ్రీదేవి భర్త బోనీ కపూర్ వార్తల్లో నిలవడం చాలా అరుదు. అటువంటిది బోనీకపూర్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.అందుకు కారణం నెట్టింట్లో వైరల్‌గా మారిన ఒకేఒక్క వీడియో.బాలీవుడ్ నటీనటుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన బోనీకపూర్ అదే కార్యక్రమానికి హాజరైన మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలాతో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.ఫోటోల తంతు పూర్తయ్యాక వెళ్లిపోతుండగా బోనీకపూర్ తన చేత్తో ఊర్వశి బ్యాక్‌ను తట్టి అదేమి పెద్ద విషయం కాదన్నట్లు నవ్వుతూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఊర్వశి కూడా ఏమి మాట్లాడలేక నవ్వుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.అయితే అందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు బోనీకపూర్‌పై విరుచుకుపడ్డారు. కూతురు వయసున్న అమ్మాయితో ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తన ఏంటని తిట్టిపోస్తున్నారు. పబ్లిక్ లో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవరిస్తున్నారని.. వీరికి బుద్ధి చెప్పాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఇంకా ముందుకెళ్ళి ఊర్వశి అక్కడే బోనీ చెంప చెళ్ళుమనిపించి ఉండాల్సిందని అన్నారు.ఈ విషయంపై బోనీ కపూర్ కానీ ఊర్వశి రౌతేలా కానీ స్పందించలేదు.