దశాబ్ద కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమ బాలీవుడ్‌కు ధీటుగా ఎదిగింది.బాహుబలి తరువాత దక్షిణాది సినీ పరిశ్రమ బాలీవుడ్‌ను సైతం ఆక్రమించేసింది.బడ్జెట్ పరంగా,కథల పరంగా,క్వాలిటీ పరంగా ఇలా ఎందులో చూసుకున్నా దక్షిణాది సినీ పరిశ్రమ బాలీవుడ్‌ను మించిపోయింది.ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు బాలీవుడ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ హీరోహీరోయిన్లు సైతం దక్షిణాది సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే చాలా మంది నటీనటులు నటిస్తుండగా సైరా సినిమాతో దక్షిణాదిలో అడుగుపెట్టిన బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తమిళ సినిమాలో పూర్తిస్థాయి రోల్‌లో నటిస్తున్నారు.యాక్టర్ కమ్ దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉయిరంద మనిద చిత్రంలో బిగ్‌బి మరో లీడ్‌రోల్‌లో నటిస్తున్నారు. అందుకోసం పూర్తిగా దక్షిణాది వ్యక్తిగా మారిన అమితాబ్ తెల్లచొక్క,తెల్లపంచె ఎర్రటి టవల్ కట్టుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు.

రెండేళ్లుగా అమితాబ్ సార్ కోసం వేచి ఉన్నామని కథలో బలం ఉండడంతో నటించడానికి అంగీకరించారంటూ నటుడు ఎస్‌జే సూర్య తెలిపాడు.బిగ్‌బితో కలసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఎస్‌జే సూర్య ఇది నా “ఇది నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన క్షణం. థ్యాంక్ యూ.. గాడ్.. అమ్మా.. నాన్నా. నేను నా కలలో కూడా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సార్ తో కలిసి నటిస్తానని అనుకోలేదు” అంటూ ట్వీట్ చేశాడు.బిగ్‌బి ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్ విడుదల చేసి తమిళ చిత్ర పరిశ్రమకు స్వాగతం పలుకుతున్నామన్నారు..
