అల్పపీడనం ప్రభావంతో 4 రోజులు వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో 4 రోజులు వర్షాలు

అమరావతి  : వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోం దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి ప్రఖర్‌జైన్‌ తెలిపారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15న అల్లూరి జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos