తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 22 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 84,449 మంది భక్తులు దర్శించుకోగా 33,570 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.47 కోట్లు వచ్చిందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos