బీజేపీవి నీచ రాజకీయాలు

బీజేపీవి నీచ రాజకీయాలు

న్యూ ఢిల్లీ: భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి డిన్నర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విందుకు దేశంలోని అన్ని పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడలకు కూడా ఆహ్వానం అందించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు మాత్రం ఇప్పటి వరకూ ఆహ్వానం అందలేదు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై ఖర్గే మౌనం వీడారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగారు. ఢిల్లీలో నేడు జరిగే జీ20 విందుకు ఆహ్వానం అందకపోవడంపై ఖర్గే మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే దీనిపై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. వారు (బీజేపీ) ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు’ అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos