స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: గంటా శ్రీనివాసరావు అరెస్ట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: గంటా శ్రీనివాసరావు అరెస్ట్

విశాఖ పట్టణం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోలీసులు తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అరెస్టు చేశారు. తొలుత పోలీసులు తెల్లవారుజామున విశాఖలోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆ తరువాత దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రభుత్వ తీరును గంటా శ్రీనివాసరావు ఖండించారు. జగన్కు ప్రజలు గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. తన ప్రభుత్వం గద్దె దిగుతుందన్న టెన్షన్ జగన్లో ఉందని, అందుకే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని మీడియాతో చెప్పారు. ఈ కేసుకు సంబంధించి నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos