కుర్తా, పైజమా వేసుకున్న ప్రధానోపా ధ్యాయుడి పై కలెక్టర్ చిందులు..

కుర్తా, పైజమా వేసుకున్న  ప్రధానోపా ధ్యాయుడి పై  కలెక్టర్ చిందులు..

పాట్నా: స్కూలుకు కుర్తా, పైజమాతో వచ్చిన ప్రధానోపా ధ్యాయుడిని జిల్లా కలెక్టర్ తీవ్రంగా మందలించారు. బీహార్, లఖిసరాయ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం లేవని ఫిర్యాదులు రావటంతో కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ అకస్మాత్తుగా పాఠశాల తనిఖీ చేసారు. సంప్రదాయక దుస్తులైన కుర్తా, ఫైజమాతో హెడ్మాస్టర్ నిర్భయ్ కుమార్ రావడంతో కలెక్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ”మీరు చదు వు చెప్పడం కంటే ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగితే బాగుంటుంది. ఈ దుస్తుల్లో మీరు టీచర్లా కనిపించడం లేదు. ప్రజాప్రతినిధిలా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. హెడ్మాస్టర్ వివరణ ఇచ్చేలోగా సంజయ్ కుమార్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అంటూ గద్దించారు. షోకాజ్ నోటీసు ఇచ్చారు. 24 గంటల్లోగా నివేదిక సమ ర్పించాలని ఆదేశించారు. ”హెడ్మాస్టార్ ఉద్యోగానికి మీ రు పనికిరారు. అందువల్ల మీ జీతం నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వబోతున్నాను” అని చెప్పారు. బీహార్లో పాఠ శాల సిబ్బందికి సమవస్త్ర విధానం లేదు. సంప్రదాయ దుస్తులు ధరించినందుకు జీతంలో జీతం నిలుపుదల ఆక్షేపణీయమని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టిఇటి) టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్తాబ్ ఫిరోజ్ వ్యాఖ్యానించారు. కలెక్టర్ తనను మందలించిన తీరుపై హెడ్మాస్టర్ నిర్భయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా టీచర్ వృత్తిలో ఉన్నా ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదన్నారు. కలెక్టర్ను తక్షణం సస్పెండ్ చేసి, ఆయన జీతాన్ని నిలిపివేయాలని జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పూ యాదవ్ ముఖ్యమంత్రిని ఒక ట్వీట్లో కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos