మోదీ మరోసారి క్షమాపణలు చెప్పాలి

మోదీ మరోసారి క్షమాపణలు చెప్పాలి

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని మోదీపై ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాగు చట్టాలను రద్దు చేస్తూ క్షమాపణలు చెప్పిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఇప్పుడు లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన హింసాకాండ కేసులో క్షమాపణలు చెప్పవలసిన సమయం వచ్చింద’ అన్నారు. అంతకు ముందు ఈ కేసులో నిందితుడైన ఆశిశ్ మిశ్రా తండ్రిని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సత్యం కళ్ళకు ఎదురుగా స్పష్టంగా కనిపి స్తోంద ని చెప్పారు. లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఓ కారు దూసు కెళ్ళింది. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పో యారు. వీరిలో నలుగురు రైతులు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాతోపాటు 13 మంది నిందితులు. ప్రణాళికా బద్ధంగా, ఉద్దేశ పూర్వ కంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు నివేదించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos