బెంగళూరు: మాజీ ప్రధాని డీ దేవేగౌడ కుటుంబం దేశ రాజకీయాల్లో అరుదైన ‘ఘనత’ సాధించింది. పార్లమెంట్‌తో పాటు కర్ణాటక అసెంబ్లీ ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తు న్న కుటుంబంగా అవతరించింది.మంగవారం వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవెగౌడ మనవడు సూరజ్ రేవణ్ణ గెలుపొందటం ఈ రికార్డు సృష్టికి కారణం. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్న కుమారుడే సూరజ్.దేవేగౌడ రాజ్యసభ సభ్యుడు, ఆయన చిన్న కుమారుడు హెచ్డీ కుమారస్వామి చెన్నపట్నం ఎమ్మెల్యే, సూరజ్ సోద రుడు ప్రజ్వల్ హాసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు సూరజ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. రేవణ్న కూడా విధానసభలో సభ్యుడు. సూరజ్ తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలు. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యే. వీరి కుమారుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తి స్తు న్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు.