ముంబై : దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వేలికి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ప్రియాంక్ పంచల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ముంబై బింద్రా కుర్లా కాంప్లెక్స్‌లో సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మకు గాయమైంది. దరిమిలా టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరమయ్యాడు. ఈ నెల 26 నుంచి తొలి టెస్టు ఆడడం ద్వారా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది.