తాతయ్య అల్లు రామలింగయ్యతో 29 ఏళ్ల క్రితం దిగిన ఫొటోను సినీనటుడు అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి అప్పటి తీపి గుర్తులను గురించి తెలిపాడు.’పద్మశ్రీ అందుకుని తిరిగి వస్తున్న తాతయ్యకు స్వాగతం పలకడానికి మేమంతా విమానాశ్రయానికి వెళ్లాము. పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు.. అద్భుత ప్రయాణం‘ అని అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.1990లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అల్లు రామలింగయ్యకు ‘పద్మశ్రీ ‘అవార్డు ప్రదానం చేసి గౌరవించింది.