హైదరాబాదు: అక్రమాస్తుల అభియోగంపై తెదేపా అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడుకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యం విచారణ కొనసా గించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. వైకాపా నేత లక్ష్మీపార్వతి 2005లో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో ఈ వ్యాజ్యంపై ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం నిలుపుదల ఉత్తర్వుల్ని జారీ చేసింది. వీటి పొడిగింపు ఉత్తర్వు లేక పోవ డంతో విచారణను కొనసాగించాలని ఏసీబీ కోర్టుకు తీర్మానించింది. తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి సాంబశివరావు నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఫిర్యాదుదారు లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయదలచని విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీం కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.