బికనేర్ : రాజస్థాన్ , బికనీర్ వైమానిక కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం పేలని మోర్టారును కనుగొన్నారు. భారత వైమానిక దళ అధికారులు లైవ్ మోర్టారు ఉన్న స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం భారత- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే. ఈ కోణంలో మోర్టారు ఉనికి గురించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికార్లు తెలిపారు.