అత్యున్నత స్థాయికి నిఫ్టి

అత్యున్నత స్థాయికి నిఫ్టి

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.31 గంటలకు నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,743 వద్ద, సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 39,201 వద్ద ట్రేడయ్యాయి. నేటి ట్రేడింగ్ లో నిఫ్టీ మొదటి సారిగా గరిష్ఠానికి చేరింది. మార్కెట్ ప్రారంభ దశలో 11,755 సూచికను తాకింది. బ్యాంక్ నిఫ్టీ 0.72 పెరిగి 30,230 వద్ద, ట్రేడయ్యింది. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా 1.20 శాతం లాభపడి 3,460 వద్ద ట్రేడయ్యింది. బుధవారం చమురు ధరలు పెరిగాయి. ఆంక్షలు, ఉత్పత్తిలో కోత వల్ల అమెరికాలో చమురు డిమాండ్ అధికమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos