తాగి అల్లర్లకు దిగిన నటి

  • In Crime
  • April 2, 2019
  • 188 Views
తాగి అల్లర్లకు దిగిన నటి

ముంబై : బాలీవుడ్ నటి రూహి సింగ్ తాగి అల్లరి సృష్టించినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. క్యాలెండ్ గర్ల్స్, ఇష్క్ ఫరెవర్ లాంటి సినిమాలతో పాటు పలు వెబ్ సీరియల్స్ నటించిన రూహి సోమవారం రాత్రంతా తన ఇద్దరు స్నేహితులు రాహుల్, స్వప్నిల్లతో కలసి పూటుగా తాగింది. రెండు గంటల ప్రాంతంలో బాంద్రా రోడ్డులోని ఓ హోటల్లో తిండి కోసం ఆగింది. రెస్టారెంట్‌ను కట్టి వేస్తున్నామని సిబ్బంది చెప్పినా వినకుండా వారిని బండ బూతులు తిట్టసాగింది. దీంతో వారు చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారక్కడికి చేరుకుని నచ్చజెప్పజూశారు. వారితోనూ అలాగే ప్రవర్తించడంతో రాహుల్, స్వప్నిల్ను అరెస్టు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్టు చేయకూడదనే నిబంధన వల్ల ఆమెను వదిలి పెట్టారు. ఇంటికి వెళుతూ రూహి పార్కింగ్‌లో ఉన్న అయిదు వాహనాలను ఢీ కొట్టింది. శాంతాక్రజ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మద్యం సేవించిందా, లేదా…తెలుసుకోవడానికి శాంపిల్స్ తీసుకున్నారు. ఆమె తాగినట్లు వైద్య నివేదిక అందిందని నగర అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos