మదనపల్లె: ‘ప్రధాని మోదీని మించిన కరుడు గట్టిన ఉగ్రవాది ఎవ్వరూ లేరు. గోద్రాలో వందల మంది అమాయకుల్ని పొట్టన బెట్టుకున్నార’ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మదనపల్లిలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ఓట్ల దొంగలను కాపాడిన దేశంలో మోదీ ఎలాంటి అభివృద్ధి చేయలేద’ని దుయ్యబట్టారు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు ‘ పవన్ పార్టీని నమ్ముకొంటే అత్తారింటికి పోతారు’ అని వ్యాఖ్యానించారు. తనను నమ్ముకొంటే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. ‘తిరుమలను కేంద్రం పరిధిలోకి తీసుకు రావాలని కుట్ర పన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకొన్న వారేవరూ బాగుపడ లేదు. రుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి’ అని స్పష్టీకరించారు. ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో సినీ నటులు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. వలస పక్షులు- సినీనటులు వైసీపీ తరపున ప్రచారం చేయడంపై బాబు వ్యంగ్యాస్త్రాలను సంధించారు.