ఓ డైరెక్టర్ నాతో దారుణంగా ప్రవర్తించాడు

ఓ డైరెక్టర్ నాతో దారుణంగా ప్రవర్తించాడు

ముంబై: కాస్టింగ్ కౌచ్ ఎంత దారుణంగా ఉంటుందో బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ ఒక పత్రిక ముఖాముఖిలో వెల్లడించింది. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను విపులీకరించింది. ‘ఒక కాల్ సెంటర్ లో పని చేస్తూ బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించాను. బాలీవుడ్ కు వచ్చిన తొలినాళ్లలో నాకు ఒక దర్శకుడు పరిచయం అయ్యాడు. ఎంతో మంచి వ్యక్తిలా నాతో మాట్లాడేవాడు. ఒక సినిమాలో అవకాశం ఇప్పిస్తానని… అందులో ముద్దు సన్నివేశం ఉంటుం దని… దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని నన్ను పిలిచి, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. నన్ను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిం చాడు. సినిమా ఆఫర్లను తెప్పించే బాధ్యత తనదే అని చెపుతూ, నన్నును నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతని బారి నుంచి తప్పించుకున్నాన’ని తెలిపింది. సల్మాన్ సరసన తొలుత నటించిన జహీర్ ఖాన్ ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపీచంద్ సరసన చాణక్య సినిమాలో కూడా నటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos