మోదీ ఉత్తరాధికారి ఆదిత్య నాథ్‌

మోదీ ఉత్తరాధికారి ఆదిత్య నాథ్‌

పీలీబీత్ : దేశ ప్రధానిగా 2024లో ఉత్తర ర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికవుతారని హిందూ రక్షా సేన జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి జోస్యం చెప్పారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘యోగికి మాత్రమే భారత్ను హిందూ దేశంగా ప్రకటించగల సత్తా ఉంది. వసీమ్ రిజ్వీ తన సొంత గూటికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన వసీమ్ రావత్గా మారారు. ఆయన తిరిగి రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవత్వం పరిమళించే విధంగా మొహమ్మద్పై వసీమ్ రిజ్వీ పుస్తకం రాసినందుకు కృతజ్ఞతలు. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం నిజమైంది కాదు. నేటికీ మనం స్వతంత్రం పొందలేదు. బ్రిటిషనర్ల నిబంధనలు ఇంకా దేశంలో ఉన్నాయి. భారత్కు కొత్త రాజ్యాంగం అవసరమ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos