ప్రధానితో మాట్లాడే ధైర్యం ఉందా?

ప్రధానితో మాట్లాడే ధైర్యం ఉందా?

హైదరాబాద్: కేంద్ర మంత్రి ఒకరు తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖ రులతో మాట్లాడారు. ‘భాజపా నాయకులకు చేతనైతే ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి. చప్పట్లు కొట్టడం, దీపాలు ఎందుకు వెలిగించాలని మేము ప్రశ్నించామా?, ప్రైవేట్ ఆస్పత్రుల పై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో భాజపా నేతలు చెప్పాలి. ఎంఐఎంతో కలిస్తే.. కరోనా వచ్చేస్తోందా?, కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలి. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయా లున్నా య’న్నారు. . హైదరాబాద్లో లాక్డౌన్తో ప్రయోజనం ఉండదు. కరోనా వస్తుంది.. పోతుంది.. కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ను ఆపగలరు. దీనికి మంత్రి మహమూద్ అలీ, ఉపసభాపతి పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతురావే ఉదాహరణ. ఫిజికల్ ఫిట్నెస్ లేనివారు మాత్రమే కరోనాతో ఇబ్బందులు పడుతు న్నార’ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలని ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించక పోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి?అని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos